న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా పాకిస్థాన్‌పై తీసుకున్న ప్రతీకార చర్యల కొనసాగింపుగా తక్షణమే పాకిస్థానీలకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది. పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలన్నీ ఏప్రిల్ 27 నుంచి రద్దయినట్లేనని విదేశాంగ శాఖ ప్రకటించింది.
పాక్ జాతీయులకు జారీచేసిన మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా దేశంలో ఉన్న పాక్ జాతీయులందరూ భారత్‌ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్‌లోని భారతీయులందరూ త్వరగా దేశానికి రావాలని కోరింది.