Virat kohli : భారత స్టార్ క్రికెటర్ (Indian star cricketer), టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆయన భార్య అనుష్క శర్మ (Anushka Sharma) అయోధ్య (Ayodhya) లోని ప్రముఖ హనుమాన్ గర్హి (Hanuman Garhi) దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. అక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూలమాలలతో కోహ్లీ, అనుష్క శర్మ దంపతులను సత్కరించారు.
ఇద్దరికీ నుదుట తిలకం దిద్దారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటాలను అందజేశారు. కాగా ఇటీవలే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహరాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనుష్కశర్మతో కలిసి పలు క్షేత్రాలు సందర్శిస్తున్నాడు.
#ViratKohli visits Hanuman Garhi in Ayodhya but skips Ram Mandir again — just like during the pran pratishtha ceremony.
Is this a silent message to the BJP? pic.twitter.com/YJmP8HpHRy
— Chikku (@imChikku_) May 25, 2025
Ayodhya, UP: Indian cricketer Virat Kohli and his wife Anushka Sharma visited Ayodhya Dham, where they offered prayers at Ram Lalla and Hanumangarhi. During this, they also met Mahant Sanjay Das Ji Maharaj and took blessings. pic.twitter.com/fwavqHsAdB
— IANS (@ians_india) May 25, 2025