Viral video : సాధారణంగా జలపాతం అంటే కొండలపై నుంచి నీరు లోయలలోకి ప్రవేశిస్తుంది. పాల మీగడలా తెల్లటి నురగలు కప్పుకుని జలపాతం జలజల పారుతుంటే.. చూసే కనులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. కనువిందు చేసే జలపాతాలను వీక్షించడంపై జనానికి మక్కువ ఎక్కువ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జలపాతాలు ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతాలుగా మారిపోయాయి.
కొంత సమయం కేటాయించి, కొంచెం ఖర్చు భరించగలిగితే ఇలాంటి జలపాతాలు ఎవరైనా ఎక్కడైనా వీక్షించవచ్చు. కానీ కొండ పైనుంచి లోయలోకి దుంకబోయి మధ్యలో నుంచే తిరిగి పైకి ఎగిరిపోయే రివర్స్ వాటర్ ఫాల్స్‌ను ఎప్పుడైనా చూశారా..? వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచే పైకి ఎగిరిపోవడమేంటి అనుకుంటున్నారా..? కానీ, ఇది నిజం. అత్యంత అరుదుగా ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి.
తాజాగా మహారాష్ట్రలోని ఓ వాటర్ ఫాల్ రివర్స్ గేర్ వేసింది. వాటర్ ఫాల్‌కు వ్యతిరేక దిశలో లోయలో బలమైన గాలులు వీయడంతో పారే జలపాతం కాస్త పైకి ఎగిరిపోయింది. ఈ అరుదైన అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.
Strong winds create a reverse waterfall in Maharashtra, India.pic.twitter.com/4C8hyhzeJ2
— Wonder of Science (@wonderofscience) November 19, 2022