న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో వధువు ముందు కూర్చుని అతిధుల ఎదుట పెండ్లి కొడుకు రొమాంటిక్ సాంగ్ అందుకుంటే నవ వధువు ఎంతగానో మురిసిపోతుంది. పాకిస్తాన్‌కు చెందిన జంట విషయంలో అదే జరిగింది. పెండ్లికొడుకు సమి రషీద్ తన భార్య ఎదుట కూర్చుని ఆమె కోసం చాంద్ సిఫారిష్ సాంగ్‌ను శ్రావ్యంగా ఆలపించాడు.
అతిధుల హర్షధ్వానాలతో అభినందిస్తుండగా రషీద్ పాటను కొనసాగించాడు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోలో పెండ్లికొడుకు వధువు ఎదురుగా ఛైర్లో కూర్చుని గిటార్ ప్లే చేస్తూ కనిపించారు.
అమీర్ ఖాన్, కాజోల్ మూవీ ఫనా మూవీ నుంచి చాంద్ సిఫారిష్ సాంగ్‌ను పాడుతుండగా అతిధులు చుట్టూ చేరి చప్పట్లతో ప్రోత్సహించడం కనిపిస్తుంది. చాంద్ సిఫారిష్ సాంగ్‌ను కైలాష్ ఖేర్, షాన్ ఆలపించారు. సమి రషీద్ పెర్పామెన్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. భార్య పట్ల మీరు చూపిన గౌరవం అద్భుతమని ఓ యూజర్ ప్రశంసలు గుప్పించారు.