జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసేలా కన్పించడంలేదు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండగా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. సందర్భమొచ్చినప్పుడల్లా సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై (Sachin Pilot) తన అసహనాన్ని వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఇక యువ నాయకుడు సచిన్ పైలట్ తానేమి తక్కువకాదనట్లుగా.. నేరుగా గెహ్లాట్ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టారు. సొంతంగా ప్రచారం మొదలుపెట్టిన సచిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. కాగా, సచిన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గెహ్లాట్.. ఆయనను చీడపురుగుతో పోల్చిన విషయం తెలిసిందే. యువనేతను కరోనా వైరస్‌తో పోల్చిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతున్నది. అది పాత వీడియోనే అయినప్పటికీ అందులో గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఓ సమావేశానికి హాజరైన సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందని పరోక్షంగా సచిన్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో సమావేశంలో నవ్వులు పూచాయి. అయితే ఎక్కడా ఆయన మాజీ డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించలేదు.
राजस्थान में अलग ही खेल चल रहा है!
पहले कोरोना आ गया फिर एक बड़ा कोरोना और आ गया हमारी पार्टी के अंदर…. – अशोक गहलोत (CM राजस्थान)
(यह बड़ा कोरोना कांग्रेस पार्टी में कौन ??) pic.twitter.com/Kkzl3ODNmH— Sachin (@Sachin54620442) January 19, 2023