న్యూఢిల్లీ : ఓ మహిళ మూడు సింహాల వెనుక నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రూర మృగాలంటే అందరూ వణికిపోతుంటారు. అయితే ఈ మహిళ ఏమాత్రం భయపడకుండా సింహాల వెనుక దర్జాగా నడిచివస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను డిజిటల్ కంటెంట్ క్రియేటర్ జెన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఆమె ఇన్స్టాగ్రాం ఫీడ్ పలు సింహాల వీడియోలతో నిండిఉంది. జంతువులతో కలిసి జెన్ నడిచివస్తున్న వీడియోకు ఇప్పటివరకూ 60 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. మూడు సింహాలు తమతో ఆమెను నడిచేందుకు అనుమతిస్తున్నాయంటే వాటికి ఆ మహిళ ఓ ప్రత్యేక వ్యక్తి అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ సింహాలు ఎంత సౌమ్యంగా ఉన్నా ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని, ఆ మహిళ జాగ్రత్తగా ఉండాలని లయన్స్‌తో గేమ్స్ ప్రమాదమని మరో యూజర్ చురకలు వేశారు.