న్యూయార్క్ : ఫుడ్ లవర్స్‌కు పిజా (Viral Video) పేరు చెబితే వారిలో హాట్ డిష్‌ను తినాలనే ఆసక్తి అంతా ఇంతా కాదు. క్రిస్పీ క్రస్ట్, డీప్ డిష్, చీజ్ బర్ట్స్ ఇలా వెరైటీ ఏదైనా ఈ ఇటాలియన్ డిష్‌కు భోజనప్రియులు ఫిదా కావాల్సిందే. ఇప్పుడు సడెన్‌గా పిజా గురించి ఎందుకు చెబుతున్నారనే సందేహం కలిగితే..ఇప్పుడు నెట్టింట ఓ పిజా ఫ్యాక్టరీ వీడియో తెగ వైరలవుతోంది.
పిజా ప్రిపరేషన్ నుంచి ఈ వీడియో మొదలవుతంది. ప్రతి దశలోనూ క్వాలిటీ చెక్‌తో పాటు ప్రతి మెషీన్లో ఉన్న హోల్స్ నుంచి సాస్, చీజ్ సమానంగా పిజాపై పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ పిజాను రెండు సార్లు బేక్ చేయడం చూడొచ్చు. రెండో సారి తక్కువ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేయగా ఆపై బాక్స్‌లో పిజాను ప్యాక్ చేయడం కనిపిస్తుంది. ఇక మొత్తం ప్రక్రియను పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని క్లీన్‌గా చేపట్టడం ఆకట్టుకుంటుంది.
అయితే ఈ పిజాపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇది పిజాలా కనిపించడం లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, బిస్కెట్లా ఉందని మరో యూజర్ రాసకొచ్చారు. మరికొందరు పిజా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను ప్రశంసించారు. పెద్దసంఖ్యలో తయారుచేసే ఆహారోత్పత్తులు అన్నీ రుచిగా ఉండవని మరో యూజర్ తేల్చేశారు. భారీగా తయారవుతున్న చెత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :