Viral Video : ఇంటర్నెట్లో ఆమ్లెట్ మోమోస్ నుంచి వాటర్మెలన్ పాప్‌కార్న్, దహి మ్యాగీ, గులాబ్ జామూన్ నూడుల్స్ వరకూ ఇలా ఎన్నో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్లు, ఫుడ్ ఎక్స్‌పరిమెంట్స్‌తో కూడిన వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇక లేటెస్ట్గా మోటివేషనల్ స్పీకర్ గౌరవ్ ఖన్నా తాను ఫ్రూట్ సమోసాను ఎంజాయ్ చేసిన వీడియోను నెట్టింట విడుదల చేశారు.
ఈ క్లిప్‌లో తన కారు సీటులో కూర్చున్న గౌరవ్ ఖన్నా తాను న్యూఢిల్లీ పశ్చిమ్ విహార్‌లో ఉన్నానని చెప్పడం వినిపిస్తుంది. ఆపై సమోసాలో ఏముందోనని దాని పైపొర తీసి పరిశీలిస్తాడు. సమోసాలో పొటాటో స్టఫ్ ఉంది, ఫ్రూట్స్ లేవని చెబుతాడు. సమోసాలు కేవలం ఆలూ స్టఫ్‌తోనే చేస్తారు..ఫ్రూట్ సమోసా అంటూ ఏమీ ఉండదు..మీరు ఫ్రూట్ సమోసా గురించి లోతుగా ఆలోచిస్తుండాలి అని చివర్లో ట్విస్ట్ ఇస్తాడు.
లోతుగా ఆలోచించడాన్ని ఆంగ్లంలో ముల్ ఓవర్ అంటారని ముగిస్తాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బ్రదర్ మీరు ఇలాంటి ఐడియాలు ఇవ్వకండి…ఎవరో ఒకరు ఫ్రూట్ సమోసా తయారుచేస్తారని ఓ యూజర్ కామెంట్ చేయగా, చివర్లో మంచి ట్విస్ట్ ఇచ్చారని మరో యూజర్ రాసుకొచ్చారు. పీతంపురలో ఇప్పటికే ఫ్రూట్ సమోసాలు చేస్తున్నారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Rs.2,000 Notes: ఏప్రిల్ ఒకటో తేదీన రూ.2000 నోట్ల ఎక్స్చేంజ్ కుదరదు.. ఎందుకంటే