Viral Video : లడ్డూలను ప్రతి ఇంటా సంతోషానికి ప్రతీకలుగా భావిస్తుంటారు. పండుగలు, పూజల వేళ స్వీట్స్ అనగానే అందరూ లడ్డూల వైపు మొగ్గుచూపుతుంటారు. లడ్డూలను ఇష్టపడనివారు అరుదు కాగా, ఇన్‌స్టాగ్రాంలో ఆటోమేటిక్ మోతీచూర్ లడ్డూల తయారీ వీడియో తెగ వైరలవుతోంది.
అమృత్‌సర్‌లోని ఓ షాపులో ఈ వీడియో రికార్డవగా వారు లడ్డూలను చేయి పెట్టకుండానే ఎలా పరిశుభ్రంగా తయారుచేస్తారో ఇది వెల్లడిస్తోంది. బూందీలను సిద్ధం చేసిన తర్వాత ఓ వ్యక్తి మెటీరియల్‌ను మిషన్‌లో జోడించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ భారత్‌లో అత్యంత పరిశుభ్రమైన స్వీట్ షాప్ అని ఫుడ్ పేజ్ రాసుకొచ్చింది.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. ఈ వీడియోను ఏకంగా పది లక్షల మందికి పైగా వీక్షించారు. వావ్..లడ్డూ అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఓమైగాడ్ నాకిది కావాలని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
ఇండియన్ యూట్యూబర్‌తో ఇరాన్ యువతి నిశ్చితార్ధం