Viral Video | ప్రస్తుతం యువతపై సోషల్ మీడియా ప్రభావం పడుతున్నది. ఈ క్రమంలో జనాలను ఆకర్షించేందుకు కొత్త కొత్త స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెడుతూ రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియాలో హాబీ కోసం రీల్స్ చేస్తుండగా.. మరికొందరు వాటితో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఫాలోవర్స్‌తో పాటు ఫేమ్‌ను సాధించేందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాయి. కొందరు రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. తాజాగా ఓ యువతీ రీల్స్ చేస్తూ తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని సీతామర్హిలో చాలారోజుల తర్వాత బుధవారం వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
बारिश में भीगकर सोशल मीडिया पर आग लगाने वाली थी लड़की, तभी आसमान से गिरी बिजली और चर्चा में आया VIDEO pic.twitter.com/mC2bqbGK5v
— NBT Bihar (@NBTBihar) June 26, 2024
ఈ క్రమంలో బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సియా గ్రామానికి చెందిన ముఖియా రాఘవేంద్ర భగత్ అలియాస్ కమల్ భగత్ కూతురు సానియా కుమారి పొరుగునే ఉన్న దేవనారాయణ్ భగవత్ ఇంటి డాబాపై వర్షంలో నడుస్తూ డ్యాన్స్ చేస్తున్నది. ఆమె రీల్స్ చేస్తుండగా ఆమె స్నేహితుడు వీడియో తీస్తూ వచ్చాడు. ఉన్నట్టుండి ఇంటికి దగ్గరలో భారీ శబ్దం, మెరుపులతో పిడుగుపడింది. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఇది చూసిన పలువురు ఆమె చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి సోషల్ మీడియాలో ఫేమ్ ఇచ్చేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.