న్యూఢిల్లీ: నోడియాడాలోని ఓ ఆపార్టుమెంట్ వాసుల రెసిడెంట్స్ సొసైటీ ఎన్నికలు రెండు వర్గాల మధ్య కుమ్ములాటకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీపడుతున్న ఒక వర్గం వారికి అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో వర్గం మహిళలు గొడవకు దిగారు. దాంతో మహిళా సెక్యూరిటీ గార్డులు సదరు మహిళలపై కర్రలతో దాడిచేశారు.
దాంతో ఆ మహిళలు మహిళా సెక్యూరిటీ గార్డులపై ఎదురుదాడికి దిగారు. ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. దాంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నోయిడాలోని సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీలో ఈ గొడవ జరిగింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
ఓ వీడియోలో ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులు అపార్టుమెంట్ వాసులైన కొందరు మహిళలపై కర్రలతో దాడి చేసిన దృశ్యాలు నమోదయ్యాయి. దాంతో ఆ ఇద్దరు మహిళా గార్డులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అపార్టుమెంట్ నివాసితురాలైన ఓ మహిళ.. ఒక మహిళా సెక్యూరిటీగార్డు జుట్టు పట్టి ఈడ్చుతున్న దృశ్యాలు ఉన్నా ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కాగా, ఈ కుమ్ములాటకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#WATCH | UP: Two groups of people supporting different candidates for post of Apartment Owners Association President of Noida’s Hyde Park society got into a clash yesterday. 2 women had minor injuries. Complaint registered, 2 guards detained: DCP Noida
(Vid source: Viral video) pic.twitter.com/SCHfwwM9w9
— ANI (@ANI) October 21, 2022