Viral Video | ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు ముందు జ్ఞాన భారతి మెయిన్‌రోడ్‌పై ఉల్లాలలో బాధిత యువకుడు దర్శన్, నిందితురాలు ప్రియాంక కార్లు పరస్పరంగా ఢీకొట్టుకున్నాయి. కారు దిగి మహిళను నిలదీసేందుకు దర్శన్ ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక దర్శన్ కారును కారుతో ఢీకొట్టింది.
వెంటనే అప్రమత్తమైన దర్శన్.. కారు బ్యానెట్‌ను పట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రియాంక కారులోనే అలాగే ముందుకు వెళ్లిపోయింది. దాదాపు కిలో మీటర్ వరకు దర్శన్ బ్యానెట్‌ను పట్టుకొని ప్రయాణించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, బాధితుడి స్నేహితులు మహిళ కారు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు ప్రింయాక, ఆమె భర్తపై దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక, దర్శన్‌తో పాటు అతని స్నేహితులు యశ్వంత్, సుజన్, వినయ్‌ని అరెస్టు చేశారు.
बोनट पर लटका युवक, महिला 1KM कार दौड़ाती रही, बेंगलुरु में फिर सनसनीखेज वाकया#BengaluruNews #CrimeNews pic.twitter.com/7H0L86iBzZ
— India TV (@indiatvnews) January 20, 2023