Viral Video | స్టేజీపై నృత్యం చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జమ్మూలోని బిష్నా ప్రాంతంలో చోటు చేసుకున్నది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగేశ్ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
एक और हादसा।
हंसते-गाते-नाचते हुए एक और मौत की LIVE तस्वीर। यह बहुत चिंताजनक ट्रेंड है। अब इसपर बहुत गंभीरता से व्यापक तरीक़े से बात होनी चाहये pic.twitter.com/FGPxQvWHit
— Narendra nath mishra (@iamnarendranath) September 8, 2022
అయితే, అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి.. అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాల తర్వాత నేలపై నుంచి లేకపోవడంతో శివుడి వేషధారణలో మరో వ్యక్తితో పాటు పలువురి లేపేందుకు ప్రయత్నించగా.. ఊలుకూ పలుకు లేకపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, గుండెపోటు కారణంగానే యోగేశ్ మృతి చెందినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. ఇటీవల బరేలోనూ ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్నేహితుడి బర్త్డే పార్టీలో పాల్గొన్న వ్యక్తి హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది.
A man fell on the ground and died while dancing at a birthday party in Bareilly. The incident took place on Thursday night. #Viral #ViralVideo #viraltwitter #viral2022 #UttarPradesh #Bareilly #India pic.twitter.com/VJRbsHqkSh
— Anjali Choudhury (@AnjaliC07) September 3, 2022