Violence In Manipur | మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు.
ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సెప్టెంబరు 16న ఆర్మీ డ్రెస్ ధరించడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో లోయ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం అనధికారికంగా సమ్మెను పాటించారు. మంగళవారం నుంచి 48 గంటలపాటు లాక్‌డౌన్‌ను అమలు చేశారు.
కాగా, గురువారం మధ్యాహ్నం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా నిరసనకు దిగారు. అరెస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్‌ను పేల్చారు. ఈ నేపథ్యంలో పలువురు నిరసకారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు.
మరోవైపు మణిపూర్‌లో మే నుంచి జరుగుతున్న అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో 150 మందికిపైగా మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇళ్లు కాలిపోవడంతో నిరాశ్రుయులైన వేలాది మంది ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- clash
- Manipur
- Many Injured
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

