న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో ఆదివారం దుర్గ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింస ఉద్రిక్తతలను రాజేసింది. ఈ ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. పోలీసులు 30 మందిని అదుపులోనికి తీసుకున్నారు. భరూచ్ ఎస్పీ కథనం ప్రకారం మహరాజ్ గంజ్‌లో విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉపయోగించిన లౌడ్ స్పీకర్ల విషయమై ఘర్షణ తలెత్తింది.
ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని, తూటాలు పేల్చుకొన్నాయి. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ యువకుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులు సోమవారం పలు దుకాణాలకు, వాహనాలకు, ఒక దవాఖానకు, బైక్ షోరూమ్‌కు నిప్పు పెట్టారు.