గువాహటి, డిసెంబర్ 23: అస్సాంలోని పశ్చిక కర్బీ ఆంగ్లాంగ్‌లో కర్బీ గిరిజనుల ఆధ్వర్యంలో మంగళవారం కూడా హింస కొనసాగింది. కొన్ని అల్లరి మూకలు గువాహటికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖెరోనీలో షాపులను, వాహనాలను దగ్ధం చేయడమే కాక, పోలీసులపై రాళ్లు, బాంబులు, బాణాలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఒక ఐపీఎస్ అధికారి సహా 34 మంది పోలీసులు గాయపడ్డారు.
అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. రెండు వర్గాల ప్రభుత్వ భూముల నుంచి బయటి వ్యక్తులను ఖాళీ చేయించాలనే డిమాండ్‌పై కర్బీ గిరిజనులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.