శనివారం 06 మార్చి 2021
National - Jan 27, 2021 , 20:34:53

రిపబ్లిక్‌ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్‌ సింగ్‌

రిపబ్లిక్‌ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్‌ సింగ్‌

చండీగఢ్‌ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింసను పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరింద్‌ సింగ్‌ బుధవారం ఖండించారు. ఈ ఘటన దేశానికే అవమానాన్ని కలిగించిందని, రైతుల ఆందోళనను బలహీన పరిచిందని పేర్కొన్నారు. ఎర్రకోట స్వతంత్ర భారతదేశానికి ప్రతీక అని, వేలాది మంది భారతీయులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను వదులుకున్నారన్నారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా రాజకీయ పార్టీ, ఎవరిదైనా ప్రమేయం ఉంటే కేంద్రం దర్యాప్తు చేయాలన్నారు. ఇటీవలి పరిణామాలతో పంజాబ్‌లో పెట్టుబడులను మందగించాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల గొంతు వినడానికి ప్రభుత్వం విఫలమైతే ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. జనాభాలో 70 శాతం మంది రైతులు ఉన్నారని, మైనారిటీలందరినీ కలుపుకొని స్థిరత్వం, లౌకికవాదం దేశం సమగ్రాభివృద్ధికి కీలకమని.. ‘హిందుత్వ కార్డు’ పురోగతికి మార్గం కాదంటూ బీజేపీకి హితవు పలికారు.

VIDEOS

logo