న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brijbhushan) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై కూడా లైంగిక వేధింపు ఆరోపణలు చేయవచ్చంటూ జోక్ వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గత ఏడాది మహిళా రెజర్లు ఆరోపించారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజర్లు చేపట్టిన నిరసనకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా నేతృత్వం వహించారు.
కాగా, రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్నది. అలాగే బజరంగ్ పునియా ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పావులుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నదని బ్రిజ్ భూషణ్ ఇటీవల విమర్శించారు. దీంతో ఆయనకు బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది.
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కలిసి ఉన్న ఫొటోపై బ్రిజ్ భూషణ్ తాజాగా స్పందించారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన వివాదస్పదంగా సమాధానం ఇచ్చారు. తనపై చేసినట్లుగానే రాహుల్ గాంధీపై కూడా వినేష్ ఫోగట్ తప్పుడు లైంగిక వేధింపు ఆరోపణలు చేయవచ్చని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఫోగట్ ఏదో ఒక రోజు ఆరోపించవచ్చు’ అని వ్యంగ్యంగా అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి.
🚨 This is utterly disgraceful!
Brijbhushan Singh’s vile remarks expose his repulsive mentality towards women, and the shameless laughter from the reporter is just as appalling.#ShameOnBJP for continuing to protect someone who has stooped this low! pic.twitter.com/iT13pVOoBJ
— S jacob (@Sjacob_inc) September 11, 2024
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024