Vinesh Phogat | హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana elections) వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా ఊహించినట్లే స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. స్టార్ రెజ్లర్లకు కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పవర్ ఖేరా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భాను పలువురు పాల్గొన్నారు.
#WATCH | Delhi: Vinesh Phogat and Bajrang Punia join the Congress party
Party’s general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria present at the joining. pic.twitter.com/BrqEFtJCKn
— ANI (@ANI) September 6, 2024
అంతకు ముందు వినేశ్, బజరంగ్ పునియా ఇద్దరూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. రెజ్లర్లతో సమావేశానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ చీఫ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వచ్చే నెల జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ఇద్దరూ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిక నేపథ్యంలో ఇద్దరు రెజ్లర్లూ రైల్వేస్‌లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలుత అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, అక్టోబర్ 2న బిష్ణోయ్ సామాజిక వర్గ శతాబ్దాల నాటి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Jitta | జిట్టా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి అడ్డగింత
Vaddepalli Krishna | ఇండస్ట్రీలో విషాదం.. సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత