దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత తీవ్రంగా ఉందని ప్రతిపక్షాలు అంటుంటే.. అలాంటిదేమీ లేదని, తామే గెలుస్తామని బీజేపీ ధైర్యం వ్యక్తం చేస్తోంది.
అయితే బీజేపీ నమ్మకాన్ని వమ్ము చేసే ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఒక గ్రామంలో ప్రచారం చేయడానికి వెళ్లారు. అయితే అక్కడి గ్రామస్థులు ఎదురు తిరిగి ఎమ్మెల్యేను తరిమికొట్టారు.
ఈ ఘటన యూపీలోని ముజఫ్ఫర్పూర్లోని మున్వార్పూర్ గ్రామంలో వెలుగు చూసింది. సైనీకి వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయిన గ్రామస్థులు.. ఆయన గ్రామం విడిచి వెళ్లే దాకా వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చూసిన సైనీ ఆగ్రహంతో తన కారులో కూర్చొని తిరిగి వెళ్లిపోవడం ఈ వైరల్ వీడియోలో కనిపిస్తుంది.
#Watch: Villagers chase #BJPMLA Vikram Saini from his constituency.
— Free Press Journal (@fpjindia) January 20, 2022
Reportedly, #VikramSaini had reached for a meeting in his village Manavvarpur.#UPElections2022 #UttarPradesh #News #KhatauliAssembly pic.twitter.com/hXOn2hvdli