అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు… బీజేపీ నేత వ్యాఖ్యలపై విమర్శలు
న్యూఢిల్లీ: అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ దీనిపై మీడియాతో మాట్లాడారు. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అని అన్నారు.
కాగా, బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన తదితర పార్టీలు బీజేపీపై మండిపడ్డాయి. దేశ యువత, ఆర్మీని అగౌరవపర్చవద్దని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో విమర్శించారు.
మరోవైపు బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ‘అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తుంది. యూనిఫారంలో ఉన్న వారి ప్రాముఖ్యతను చిన్నచూపు చూస్తున్నారు’ అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దుయ్యబట్టారు.
देश के युवाओं और सेना के जवानों का इतना अपमान मत करो।
हमारे देश के युवा दिन-रात मेहनत करके फ़िज़िकल पास करते हैं, टेस्ट पास करते हैं, क्योंकि वो फ़ौज में जाकर पूरा जीवन देश की सेवा करना चाहते हैं, इसलिए नहीं कि वो BJP के दफ़्तर के बाहर गार्ड लगना चाहते हैं। https://t.co/PQ8B30FYHz
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2022
Our armed forces will also train for Agniveers to become security guards. This is trivialising the importance of our men in uniform. https://t.co/ENPA3nPsw1
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

