న్యూఢిల్లీ, ఆగస్టు 21: వరుస నష్టాలతో సతమతమవుతున్న పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మను తిరిగి నియమించేందుకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపారు. విజయ్ శేఖర్ శర్మ పునర్నియామకాన్ని వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారుల సలహా సంస్థ ఐఐఏఎస్ చేసిన సిఫారసుతోపాటు పలు ఇతర అంశాలపై శుక్రవారం కంపెనీ 22వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తానని గతంలో విజయ్ శేఖర్ శర్మ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఐఐఏఎస్ పేర్కొన్నది. అయినప్పటికీ ఆయనను కంపెనీ ఎండీ, సీఈవోగా కొనసాగించేందుకు ఎక్కువ మంది వాటాదారులు మొగ్గుచూపారు.