జైపూర్: ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన రణథంబోర్ జాతీయ పార్క్లో (Ranthambore National Park) 70కు పైగా పులులున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. రీల్స్ కోసం ప్రయత్నించారు. సిమెంట్ పైపులో ఉన్న పులి పిల్లలను ఒక వ్యక్తి చేతితో తాకాడు. ఆ పిల్లల సమీపంలోనే తల్లి పులి ఉన్నది. మరో వ్యక్తి పులి ముందు నడిచి వెళ్లి రీల్ కోసం ప్రయత్నించాడు.
కాగా, ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Ranthambhore Tiger Reserve : रणथंभौर में टाईगर से खेल रहे इंसान वीडियो वायरल#ranthambhore #tigerreserve #sawaimadhopur #wildlife #tiger pic.twitter.com/ZMfNs9h2SF
— Punjab Kesari Rajasthan (@punjabkesariraj) May 16, 2025