Woman Passenger | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు (Woman Passenger) విమానంలో పొగ తాగి ప్రయాణికులు, సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.
ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానం (Flight)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫాతిమా అనే మహిళ.. విమానంలో లైటర్‌తో సిగరెట్‌ను (Smoking Onboard) వెలిగించి పొగ తాగింది. ఆమె చర్యతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆమె దగ్గరకు చేరుకుని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే, సిగరెట్ ఇవ్వకపోవడమే కాదు, మరో చేతితో లైటర్ వెలిగించి ఏకంగా విమానాన్నే అంటించే ప్రయత్నం చేసింది. విమాన సీట్లకు లైటర్‌తో నిప్పు పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, సిబ్బంది బాటిల్‌తో నీళ్లు పోసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fatima, on a flight from Istanbul to Cyprus tried to light the plane on fire pic.twitter.com/9fYyTGaAn5
— Frontalforce 🇮🇳 (@FrontalForce) March 23, 2025
Also Read..
Donald Trump | నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది.. ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్
Jeff Bezos | వెనిస్ వేదికగా బెజోస్ వివాహం.. ముహూర్తం ఫిక్స్..?
Canada | కెనడాలో మధ్యంతర ఎన్నికలు..