Jeff Bezos | వెనిస్ వేదికగా బెజోస్ వివాహం.. ముహూర్తం ఫిక్స్..?
Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. ఈ వేసవిలో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇటలీ (Italy)లోని వెనిస్ (Venice) నగరం వీరి వివాహానికి వేదిక కానుంది.
ఇటలీ తీరంలో బెజోస్‌కు ఉన్న 500మిలియన్ డాలర్ల విలాస నౌక (సూపర్ యాచ్ట్)లో జూన్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ జంట అధికారికంగా తమ అతిథులకు వివాహ ఆహ్వానాలను కూడా పంపడం ప్రారంభించినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో వీరి వివాహం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఖచ్చితమైన తేదీ మాత్రం తెలియరాలేదు.
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 54 ఏళ్ల శాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో 2023లో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా బెజోన్ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21కోట్లు) విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా ఫ్లోరిడా (Florida)లోని ‘ఇండియన్ క్రీక్’ (Indian Creek) ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
“బెజోస్ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు!”
“Jeff Bezos | ప్రియురాలి కోసం రూ.560 కోట్ల ఇంటిని కొనుగోలు చేసిన బెజోస్..?”
“Jeff Bezos | ప్రియురాలు లారెన్తో జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్..?”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

