Jeff Bezos | ప్రియురాలి కోసం రూ.560 కోట్ల ఇంటిని కొనుగోలు చేసిన బెజోస్..?
Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు (Amazon founder) జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు (Amazon founder) జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం ఆయన రెండో పెళ్లే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను బెజోస్ త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే నెలలో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన ప్రియురాలి కోసం బెజోస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
అమెరికా ఫ్లోరిడా (Florida)లోని ‘ఇండియన్ క్రీక్’ (Indian Creek) ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. 2.8 ఎకరాల విస్తీర్ణంలో 1965లో ఈ ఇంటిని నిర్మించారు. ఎంటీఎం స్టార్ ఇంటర్నేషనల్ కార్ప్ మాజీ మేనేజర్టులియా నుంచి జెఫ్బెజోజ్ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇండియన్ క్రీక్‌ను అక్కడ ‘బిలియనీర్ బంకర్’ (Billionaire Bunker) అని కూడా పిలుస్తారట. కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్ వంటి ప్రముఖులు కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఈ ఐలాండ్‌లో కేవలం 81మంది మాత్రమే నివాసముంటున్నారు.
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53 ఏళ్ల సాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని, మే నెలలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ సందర్భంగా బెజోన్ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్ డాలర్ల విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు సాంచెజ్ కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి 2021లో వైదొలిగిన జెఫ్ బెజోస్.. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అంతరిక్ష విమానయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’తోపాటు వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికకు అధినేతగానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం బోజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన నెట్ వర్త్ 165 బిలియన్ డాలర్లుగా ఉంది.
Also Read..
Raghav Chadha | ట్విట్టర్ బయోలో కీలక మార్పు చేసిన ఆప్ నేత రాఘవ్ చద్దా
Delhi Services Bill | రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Virat Kohli | ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ ఏమన్నారంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

