Virat Kohli | ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ ఏమన్నారంటే..?
Virat Kohli | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagra) ద్వారా ఒక్కో పోస్ట్‌కు రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నాడన్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
Virat Kohli | టీమిండియా (Team India) మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి నిన్న ఒక వార్త తెగ వైరలైన విషయం తెలిసిందే. ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా కోహ్లీ భారీగానే ఆదాయం పొందుతున్నాడని.. ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కి కోహ్లీ రూ.11.45 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఆ వార్తలపై తాజాగా టీమిండియా రన్ మెషీన్ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు కోహ్లీ శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికీ కృతజ్ఞుడిని. అందుకు రుణపడి ఉన్నాను. అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం చేస్తున్న వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదు’ అని కోహ్లీ స్పష్టం చేశారు.
కాగా, 2023లో ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 స్టార్స్ జాబితాను స్టాక్ గ్రో (Stock Gro) తాజాగా విడుదల చేసింది. ఆ జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. స్టాక్ గ్రో విడుదల చేసిన జాబితా ప్రకారం.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు 1.38 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తేలింది. అంటే ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ సంపాదన రూ.11.45 కోట్లన్న మాట. భారత్ నుంచి కోహ్లీకి ఒక్కడికే ఈ జాబితాలో చోటు దక్కింది.
ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌కు 3.23 మిలియన్ల (USD) భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాడు. అంటే ఇది దాదాపుగా రూ.26.75 కోట్లకు సమానం. ఇక రొనాల్డో తర్వాత లియోనెల్ మెస్సీ (Lionel Messi) తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు 2.56 మిలియన్లు (USD) (రూ.21.49 కోట్లు) వసూలు చేస్తున్నట్లు తేలింది.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏
— Virat Kohli (@imVkohli) August 12, 2023
Also Read..
Virat Kohli | ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఒక్కో పోస్ట్‌కు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
Bengaluru | రాపిడో బైక్ బుక్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వచ్చిన బండిని చూసి షాక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

