Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
Raghav Chadha | నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha )ను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై రాఘవ్ స్పందించారు.
Raghav Chadha | నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha )ను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై రాఘవ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తనకు తాను రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ అయిన ఎంపీ (Suspended MP )గా చెప్పుకున్నారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవాళ్లకు తాను భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
‘నమస్కారం, నేను సస్పెండైన ఎంపీ రాఘవ్ చద్దాను. అవును.. నన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నేను ఏం నేరం చేశాను..? నేను కొంతమంది ఎంపీల సంతకాలను సేకరించానని బీజేపీ చెబుతోంది. ఇప్పుడు మీకు నేను అసలు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ పార్లమెంటేరియన్‌కు అయినా కమిటీ పేర్లను ప్రతిపాదించే హక్కు ఉంటుంది. అంటే నేను సెలక్ట్ కమిటీకి పేర్లను ప్రతిపాదించగలను. అలా చేయడానికి ఆ ఎంపీల సమ్మతి, సంతకం అవసరం ఉండదు. వారి పేర్లను ఇస్తే సరిపోతుంది. ఏ ఎంపీకి అయినా అందులో అభ్యంతరం ఉంటే తమ పేరును ఉపసంహరించుకోవచ్చు. నేను ఎలాంటి సంతకాలను సమర్పించలేదు’ అని వీడియోలో రాఘవ్ చద్దా వెల్లడించారు.
నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నిబంధనల అతిక్రమణ, ధిక్కార వైఖరి, అనుచిత ప్రవర్తన కారణాలతో ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సభ చైర్మెన్ ధన్కర్ ప్రకటించారు. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేంత వరకు అతనిపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
https://twitter.com/raghav_chadha/status/1689988199114821633?s=20
Also Read..
Bengaluru | రాపిడో బైక్ బుక్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వచ్చిన బండిని చూసి షాక్
MS Dhoni: రాంచీకి ఎలా వెళ్లాలి? అభిమాని హెల్ప్ తీసుకున్న ధోనీ.. వీడియో
Oil Palm | ఆయిల్‌పామ్ పంట కోతలు షురూ.. ఉత్తర తెలంగాణలో చేతికొస్తున్న తొలిసారి పంట
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

