Raghav Chadha | ట్విట్టర్ బయోలో కీలక మార్పు చేసిన ఆప్ నేత రాఘవ్ చద్దా
Raghav Chadha | సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ అయిన ఆప్ నేత (AAP Leader) రాఘవ్ చద్దా (Raghav Chadha ) తాజాగా ట్విట్టర్ బయోలో కీలక మార్పులు చేశారు.
Raghav Chadha | సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ అయిన ఆప్ నేత (AAP Leader) రాఘవ్ చద్దా (Raghav Chadha ) తాజాగా ట్విట్టర్ బయోలో కీలక మార్పులు చేశారు. గతంలో ట్విట్టర్ బయోలో తాను ‘రాజ్యసభ సభ్యుడి’గా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానంలో సస్పెండ్ చేయబడిన పార్లమెంట్ సభ్యుడిగా మార్చుకున్నారు.

నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనల అతిక్రమణ, ధిక్కార వైఖరి, అనుచిత ప్రవర్తన కారణాలతో ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సభ చైర్మెన్ ధన్కర్ ప్రకటించారు. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేంత వరకు అతనిపై నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
మరోవైపు తన సస్పెన్షన్‌పై రాఘవ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తనకు తాను రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ అయిన ఎంపీ (Suspended MP )గా చెప్పుకున్నారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవాళ్లకు తాను భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
Also Read..
Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
Delhi Services Bill | రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Heavy Rains | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

