Delhi Services Bill | రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Delhi Services Bill | ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) చట్టంగా మారింది.
Delhi Services Bill | ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023 (Government of National Capital Territory of Delhi (Amendment) Bill- 2023) పై ముర్ము శనివారం సంతకం చేశారు. దీంతో ఇది చట్టంగా అమల్లోకి వచ్చింది.
ఢిల్లీ అధికారులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కల్పించేలా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. పాలనా యంత్రాంగంపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తున్న ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. అయినప్పటికీ అధికార, విపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై తాజాగా రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టంగా మారింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మరో మూడు బిల్లులకు రాష్ట్రపతి ఈరోజు ఆమోదం తెలిపారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లులపై రాష్ట్రపతి నేడు సంతకం చేశారు. దీంతో ఈ బిల్లులు కూడా ఇప్పుడు చట్టంగా మారాయి.
Also Read..
Virat Kohli | ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ ఏమన్నారంటే..?
Actor Sathyaraj | నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం
Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

