Actor Sathyaraj | నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం
Actor Sathyaraj | ప్రముఖ నటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ (Actor Sathyaraj) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబళ్ కళింగరాయర్ (Nathambal Kalingarayar) మృతి చెందారు.
Actor Sathyaraj | ప్రముఖ నటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ (Actor Sathyaraj) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబళ్ కళింగరాయర్ (Nathambal Kalingarayar) మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 94. వృద్ధాప్యం కారణంగా కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.
కాగా, సత్యరాజ్ నిన్న హైదరాబాద్‌లో ఓ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన కోయంబత్తూర్ బయలుదేరి వెళ్లారు. నాదాంబళ్కు కుమారుడు సత్యరాజ్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు కల్పన, రూప ఉన్నారు. సత్యరాజ్ తల్లి మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
Also Read..
Heavy Rains | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Virat Kohli | ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.11.45 కోట్లు.. కోహ్లీ ఏమన్నారంటే..?
Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

