Donald Trump | నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది.. ట్రంప్ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్
Donald Trump | గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్ వుడ్స్ (Tiger Woods) షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాజీ కోడలు వెనెసా ట్రంప్ (Vanessa Trump)తో తాను రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు.
Donald Trump | గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్ వుడ్స్ (Tiger Woods) షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాజీ కోడలు వెనెసా ట్రంప్ (Vanessa Trump)తో తాను రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది..’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు వెనెసాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వెనెసా సైతం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ వుడ్స్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించారు.
Love is in the air and life is better with you by my side! We look forward to our journey through life together. At this time we would appreciate privacy for all those close to our hearts. pic.twitter.com/ETONf1pUmI
— Tiger Woods (@TigerWoods) March 23, 2025
కాగా, ట్రంప్ కుమారుడైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో 2005 నవంబర్ 12న వెనెసా వివాహం జరిగింది. ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మార్ ఎ లాగో క్లబ్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ట్రంప్ జూనియర్‌కు 2020లో ఫాక్స్‌న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం జరిగింది.
ఇక టైగర్ వుడ్స్ గతంలో స్వీడిష్ మోడల్ ఎలిన్ నార్డెగ్రెన్ను వివాహం చేసుకున్నాడు. అయితే, 15 సార్లు మేజర్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ గోల్ఫర్ పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2010లో ఎలిన్ విడాకులు తీసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలిన్తో విడాకుల తర్వాత అమెరికన్ స్కీయింగ్ లెజెండ్ లిండ్సే వాన్, ఎరికా హెర్మన్ సహా పలు హై ప్రొఫైల్ ఉన్న వారితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ట్రంప్ మాజీ కోడలితో రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు.
Also Read..
Jeff Bezos | వెనిస్ వేదికగా బెజోస్ వివాహం.. ముహూర్తం ఫిక్స్..?
Canada | కెనడాలో మధ్యంతర ఎన్నికలు..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

