Humanoid Robot | బీజింగ్, మార్చి 23 : చైనాలో రోబోల వాడకం క్రమంగా పెరుగుతున్నది. ఏకంగా హ్యూమనాయిడ్ రోబోలను అద్దెకు తెచ్చుకునే సంస్కృతి వచ్చింది. చైనాకు చెందిన జాంగ్ జెన్యువన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ తాను యూనిట్రీ జీ1 హ్యూమనాయిడ్ రోబోలను అద్దెకు తెచ్చుకున్నట్టు ఓ వీడియో పోస్ట్ చేయగా అది వైరలైంది. అందుకు గానూ ఒక్క రోజుకు 1000 యువాన్లు (1400 డాలర్లు) చెల్లించినట్టు అతడు తెలిపాడు. రోబో సేవలతో తాను సంతృప్తి చెందినట్టు అతడు వివరించాడు.
డ్యాన్స్ చేయడం, ఇల్లు క్లీనింగ్, వంట తదితర పనులు చేస్తున్న రోబో గుడ్డు పగటగొట్టడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడినట్టు వీడియోలో తెలుస్తున్నది. యూనిట్రీ జీ1 హ్యూమనాయిడ్ రోబోలను చైనీయులు రోజువారీగా అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రోబోలు ఇల్లు క్లీన్ చేయడం, వంటలు వండటం, సంభాషణలు, డేట్ లాంటివి చేస్తాయి. అందుకు రోజుకు 8 వేల నుంచి 16 వేల యువాన్లు (1100 నుంచి 2200 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోబోలను యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ అభివృద్ధి చేసింది.