Viral Video : ఫుడ్ లవర్స్‌కు వేగంగా ఆకలితీర్చేందుకు అనువైన పరిష్కారంగా బర్గర్లు ముందుకొస్తాయి. చీజ్బర్గర్ వంటి టైమ్‌లెస్ క్లాసిక్స్ నుంచి అవకాడో బర్గర్స్, కాప్రిసి బర్గర్స్ వరకూ ఎన్నో ఆప్షన్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక బర్గర్‌ను కూడా సోషల్ మీడియాలో మేకోవర్ చేస్తూ విభిన్న వైరైటీ ఫుడ్ కాంబోలకు వేదికగా మలిచారు. లేటెస్ట్గా చాక్లెట్ ఐస్‌క్రీం బర్గర్ తయారుచేసే వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
పూర్తిగా షుగర్‌తో నిండిన ఈ బర్గర్‌ను తింటే ఇక పైకి పోవడమే తరువాయి అంటూ పలువురు నెటిజన్లు ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఇక వైరల్ వీడియోలో ఈ యూనిక్ బర్గర్‌ను తయారుచేసే విధానాన్ని ఓ మహిళ వివరించడం చూడొచ్చు. బర్గర్ బన్స్ తీసుకున్న మహిళ దానిపైన లోపల మెల్టెడ్ చాక్లెట్‌ను స్ప్రెడ్ చేయడం కనిపిస్తుంది. వైట్ చాక్లెట్ బార్‌ను రెండు ముక్కలుగా విడదీసిన ఆమె వాటిని బేస్ బన్పైన ఉంచుతుంది.
తర్వాతి లేయర్‌పై స్ట్రాబెర్రీ ఐస్‌క్రీం సూప్‌ను యాడ్ చేస్తుంది. దానిపై చాక్లెట్ బార్‌ను ఉంచుతుంది. తర్వాత వాటిపై కలర్‌ఫుల్ జెమ్స్‌ను చల్లి, క్యాడ్బరీ షాట్స్‌ను యాడ్ చేస్తుంది. ఇక చాక్లెట్ ఐస్‌క్రీం బర్గర్‌ను పైన అడిషనల్ మెల్టెడ్ చాక్లెట్‌తో గార్నిష్ చేస్తుంది. ఈ డిష్‌పై నెటిజన్లు తలోరకంగా స్పందించారు.
Read More :