Uddhav Thackeray | స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి నిమిషంలో ఆహ్వానం.. రామమందిరం కార్యక్రమంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఫైర్
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రతిష్టాపన కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్పీడ్ పోస్ట్ ద్వారా ఆహ్వానం పంపడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముంబై: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టాపన సోమవారం జరుగనున్నది. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్పీడ్ పోస్ట్ ద్వారా ఆహ్వానం పంపడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాక్రే కుటుంబం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ‘సినిమా తారలందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఉద్యమంతో సన్నిహితంగా ఉన్న ఠాక్రే కుటుంబం పట్ల ఈ విధంగా వ్యవహరిస్తారు’ అని విమర్శించారు.
కాగా, ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నుంచి రెండు రోజులు నాసిక్‌లో పర్యటించిస్తారని సంజయ్ రౌత్ తెలిపారు. సోమవారం కాలారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతోపాటు గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తారని చెప్పారు. మంగళవారం నాసిక్‌లో జరిగే పార్టీ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే పాల్గొంటారని వెల్లడించారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆహ్వానం పంపడంపై సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మంత్రి ఉదయ్ సామంత్ స్పందించారు. ఆహ్వానం వేగంగా చేరేందుకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపినట్లు చెప్పారు. అది ఆయనకు అందిందని మీడియాతో అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

