న్యూఢిల్లీ : పాలు కావాలని తన సంరక్షకుడిని ఓ బేబీ ఎలిఫెంట్ కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వైరల్ క్లిప్‌లో ఏనుగు పట్ల కేర్‌టేకర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ వైరల్ వీడియోను టోరీ హోగర్ధ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో ఆహారం కోసం బుల్లి ఏనుగు వేచిచూస్తుండటం కనిపిస్తుంది.
ఆపై కేర్‌టేకర్ చిన్న బాటిల్లో పాలు నింపి ఏనుగుకు అందించే ప్రయత్నం చేస్తుండటం చూడవచ్చు. ఇక టేబుల్ వద్ద కూర్చుని ఉన్న కొందరు ఏనుగు చేష్టలను చూసి నవ్వుతుండటం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్ చేశారు.
బేబీ ఎలిఫెంట్ సూపర్ క్యూట్ అని కొందరు యూజర్లు కామెంట్ చేయగా, ఆహారం కోసం ఏనుగు చేయిచాపేలా చూసిన తీరు సరికాదని మరికొందరు యూజర్లు ఆక్షేపించారు. జంతువులను అలా యాచించేలా చేయడం సరైంది కాదని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు. ఈరోజు ఇంటర్నెట్లో ఇది క్యూటెస్ట్ వీడియో అని మరో యూజర్ కామెంట్ చేశారు.