న్యూఢిల్లీ : ఈ వీడియో చూస్తే మీ ముఖాలపై చిరునవ్వు పూయడం ఖాయం. ఓ చిన్నారి తన క్లాస్‌మేట్స్‌కు బోధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడి ఎనర్జీ లెవెల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
ऐसे ही सोच रहा हूँ कि ये बच्चा बड़ा हो कर क्या बनेगा।
ड्रिल उस्ताद या फुटबाल कोच? नेता? या फिर टीवी एंकर 😅 pic.twitter.com/MA3MxhUBur
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 19, 2022
ఐపీఎస్ అధికారి అరుణ్ బొత్రా ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో చిన్నారి తన క్లాస్‌మేట్స్‌కు బిగ్గరగా లెసన్ చెబుతుండటం కనిపిస్తుంది. గొంతు చించుకుని అరుస్తూ పదాలు పలుకుతుంటే మిగిలినవారు అతడు చెప్పింది రిపీట్ చేయడం కనిపిస్తుంది. ఈ బాలుడి ఎనర్జీ కట్టిపడేస్తోందని..ఇతను పెద్దయ్యాక డ్రిల్ మాస్టర్ లేదా ఫుట్‌బాల్ కోచ్ అవుతాడా అసలు టీవీ యాంకర్ అవుతాడా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో ఆన్లైన్లో షేర్ అయినప్పటి నుంచి లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ బాలుడు తనకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి సామర్ధ్యంతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేశాడని ఓ యూజర్ కామెంట్ చేయగా ఈ బుడతడు పెద్దయ్యాక టీవీ యాంకర్‌గా బాగా సూటవుతాడని మరో యూజర్ కామెంట్ చేశాడు.