న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. ప్రధాని మోదీకి జన్మదిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని ట్వీట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అపారమైన కృషి, సమర్థ నాయకత్వం, అంకితభావం దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపుతున్నది. మీరు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
My best wishes to Hon'ble Prime Minister, Shri Narendra Bhai Modi ji on his birthday today. His exceptional vision, exemplary leadership and dedicated service have led to all-round growth of the nation. May he be blessed with a long, healthy and happy life ahead! @narendramodi
— Vice President of India (@VPSecretariat) September 17, 2021