న్యూఢిల్లీ : ఛాతీలోనొప్పి రావడంతో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్‌లో చేరారు. 73 ఏండ్ల ధన్‌ఖఢ్‌కు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో ఉంచి, కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాజీవ్ నరంగ్ పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల బృందం పర్యవేక్షణలో వైద్య చికిత్సలు జరుగుతున్నాయని దవాఖాన వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‌ను సందర్శించి ధన్‌ఖఢ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ధన్‌ఖఢ్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.