Watch: టికెట్ లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణించిన పోలీస్.. ఆగ్రహించిన టీటీఈ
TTE vs Police | సాధారణంగా పోలీసులు టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఒక పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు.
న్యూఢిల్లీ: సాధారణంగా పోలీసులు టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఒక పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (TTE vs Police) టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం శిక్షార్హమైన నేరమని తెలిసినా వందే భారత్ రైలులో ఎందుకు ఎక్కారని ప్రశ్నించాడు. టికెట్ లేకపోతే బస్సులో వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి టీటీఈకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. టికెట్ లేకుండా ప్రయాణించిన పోలీస్‌ను నిలదీసిన టీటీఈని పలువురు ప్రశంసించారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ‘వందే భారత్ రైలు’ కదా అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.
Verbal Kalesh b/w TTE and Police Officer over Police Officer was Travelling without ticket pic.twitter.com/LhS4I56CzW
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 12, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

