Droupadi Murmu | రేపు అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రేపు (బుధవారం) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రేపు (బుధవారం) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయోధ్యలో రాష్ట్రపతి ముర్ము పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మినహా మిగతా టైమ్లో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ కేటాయించిన టైమ్లో దర్శనం చేసుకోవచ్చని చెప్పారు.
రాష్ట్రపతి ముర్ము రేపు సాయంత్రం 4 గంటలకు ఆయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అయోధ్య పరిసరాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు మూడు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. ఆమె పర్యటన కొనసాగినంత సేపు నగరంలో ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. రేపు సాయంత్రం సరయూ నది తీరాన రాష్ట్రపతి హారతి కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

