హైదరాబాద్: ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పారు. చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించి, ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ నవ శకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని తెలిపారు.
గొప్ప జాతీయ వాది అయిన ఆయన నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి, మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణ వాది అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తెలుగు వారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించి, ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న శ్రీ రామారావు… pic.twitter.com/iOXVNzHXEF
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 28, 2024