న్యూఢిల్లీ,మే 23: ప్రస్తుతం దేశంలో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో రాష్ర్టాలు, యూటీల్లో జూలై 1 నుంచి కొత్త చట్టం వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ జీ రామ్జీ )ని తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొత్త పథకానికి సంబంధించి కేంద్రం ముసాయిదా నిబంధనలను శనివారం విడుదల చేసింది.
ఈ నియమాలు తాత్కాలిక నిబంధనలు, జాతీయ అమలుకు ఒక చట్రాన్ని వివరిస్తాయి. వీటిని అమలు చేసే ముందు రాష్ట్రప్రభుత్వాలు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు సేకరిస్తారు.