
ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు ఈనెల 25 వరకు జైలు అధికారుల ముందు లొం గిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌పై బయట ఉన్న వరవరరావు ఈ నెల 5న లొంగిపోవాలి. అయితే తన బెయిల్‌ను పొడిగించాలంటూ వరవరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం 25 వరకు జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. బెయిల్ పొడిగింపు పిటిషన్‌పై 24న వాదనలు వింటామని పేర్కొంది.