వారణాసి : జానపద గాయని నేహా సింగ్ రాథోఢ్కు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పోలీసులు నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీని కించపరచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు 2025లో నమోదైన కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం కోసం ఈ చర్య తీసుకున్నారు. నేహా సింగ్ జానపద శైలిలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మోదీని పిరికిపంద అని, బ్రిటిష్ జనరల్ డయ్యర్ వంటి వారని ఆమె వ్యాఖ్యానించినట్లు కేసు నమోదైంది.
న్యూఢిల్లీ: తన శునకం వాకింగ్ కోసం దేశ రాజధాని ఢిల్లీలోని ఒక స్పోర్ట్స్ స్టేడియాన్ని ఖాళీ చేయించి వివాదంలో నిలిచిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గుర్తున్నారా? ఆయనను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అదే ఢిల్లీలో ప్రధాన పోస్టులో నియమించింది. ఆయనను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.