న్యూఢిల్లీ : జాతీయ గీతం జన గణ మన తరహాలోనే త్వరలో వందేమాతరం గేయాలాపన సందర్భంగా కూడా ప్రజలు నిలబడక తప్పదు. జాతీయ గీతానికి ఉన్న ప్రొటోకాల్స్నే 150వ వార్షికోత్సవం సందర్భంగా వందే మాతరం గేయానికి కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రస్తుతం జాతీయ గీతానికి మాత్రమే వర్తిస్తున్నది. రాజ్యాంగంలోని 51(ఏ) అధికరణ ప్రకారం కూడా జాతీయ గీతానికి ప్రజలు గౌరవించడం తప్పనిసరి. అయితే వందే మాతరం ఆలాపన సందర్భంగా ప్రజలు నిలబడాల
న్న నిబంధనలు లేవు.