లక్నో: తమ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేయనున్నట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ఏక్తా యాత్రలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ దేశభక్తిని, దేశం పట్ల గర్వాన్ని పెంపొందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ముస్లిం లీగ్ నాయకులు మహమ్మద్ అలీ జిన్నా, అలీ జౌహార్ వందేమాతర గేయాన్ని వ్యతికించడం ద్వారా దేశ ఐక్యతను దెబ్బ తీశారని యోగి అన్నారు.