Vande Bharat | వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..! భయాందోళనకు గురైన ప్రయాణికులు
Vande Bharat | ఇండోర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కోచ్ అద్దాలు పగిలిపోవడంతో కోచ్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడి ఘటన చోటు చేసుకుంది.
Vande Bharat | ఇండోర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కోచ్ అద్దాలు పగిలిపోవడంతో కోచ్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడి ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దాడి ఘటన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది. ఇండోర్ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఐదు రోజుల కిందట ఇండోర్ నుంచి నాగ్‌పూర్‌కు మార్చారు.
అయితే, గత రెండురోజులుగా ఈ రైలుపై రాళ్ల దాడి జరుగుతున్నది. ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20911)ను అక్టోబర్ 9 నుంచి నాగ్‌పూర్ వరకు పొడిగించారు. ఉజ్జయిని సెక్షన్‌లోని చింతామన్ స్టేషన్, ఉజ్జయిని మధ్య ఉదయం 6.50 గంటలకు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో కోచ్ నంబర్ సీ-6, సీ-7ల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

