న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి అందించిన అమూల్ కంపెనీ పెరుగులో బతికిన పురుగులు కనిపించాయి. ఆ విషయాన్ని సగం పెరుగు తిన్న తర్వాత గమనించిన ఆ ప్రయాణికుడు షాక్ తిన్నాడు. రైల్వే క్యాటరింగ్ సిబ్బంది తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో పురుగులున్న పెరుగును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో రైళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యతపై నెటిజన్లు ఆగ్రహ ం వ్యక్తం చేశారు.ఈ నెల 10న పాట్నా-టాటానగర్ రైల్లో జరిగిన ఈ ఘటనపై రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. నాణ్యత లేని పెరుగును సరఫరా చేసిన క్యాటరర్కు రూ.50 లక్షలు, అలాంటి క్యాటరర్కు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఐఆర్సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా విధించి, క్యాటరర్ కాం ట్రాక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడబోమని తెలిపింది.