Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రూ.187 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని విజయేంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో అసమర్థ సీఎం ఉండటం వల్లే ఈ కుంభకోణం జరిగిందన్నారు. పన్ను చెల్లింపుదారుల రెక్కల కష్టాన్ని మోసగాళ్లు ఎంజాయ్ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ లోని రూ.187 కోట్ల నిధులు ఇతర రాష్ట్రాల్లో వినియోగించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చెప్పిందని విజయేంద్ర గుర్తు చేశారు. కానీ ఈ కుంభకోణానికి అధికారులను బాధ్యులను చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఆర్థిక శాఖ కూడా సీఎం సిద్ద రామయ్య వద్దే ఉందని, కనుక ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామని చెప్పిన సీఎం సిద్దరామయ్య ముందు వాల్మీకి కార్పొరేషన్ లో కుంభకోణానికి సమాధానం చెప్పాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. వాల్మీకి కార్పొరేషన్ నుంచి పలు బ్యాంకు ఖాతాలకు చట్ట విరుద్ధంగా రూ.187 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారని చంద్రశేఖరన్ తన సూసైడ్ నోటులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందా (సిట్)న్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసింది. మరోవైపు యూనియన్ బ్యాంకు సైతం తమ బ్యాంకులోని వాల్మీకి కార్పొరేషన్ ఖాతా నుంచి చట్ట విరుద్ధంగా నగదు బదిలీ అయ్యిందని ఫిర్యాదు చేయడంతో సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నది.
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!